హైదరాబాద్: సానియా మీర్జా మళ్లీ టైటిల్ కొట్టింది. ఆస్ట్రేలియాలో జరిగిన హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో డబుల్స్ టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. ఉక్రెయిన్ ప్లేయర్ నదియా కిచెనోక్‌తో కలిసి సానియా మీర్జా.. ఫైనల్లో అదరగొట్టింది. సానియా జోడీ 6-4, 6-4 స్కోర్‌తో ఫైనల్లో చైనాకు చెందిన జాంగ్ షువాయ్, పెంగ్ షువాయ్ జోడిపై గెలుపొందింది. సానియా, కిచెనోక్ జంట.. ఏ దశలోనూ ప్రత్యర్థులకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. మ్యాచ్‌ను ఈజీగా తమ ఖతాలో వేసుకున్నారు.
శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో ఐదో సీడ్ సానియా-నడియా కిచెనోక్ (ఉక్రెయిన్) జోడీ 7-6 (7/3), 6-2తో టమారా జిదాన్‌సెక్ (స్లొవేకియా)-మేరీ బౌకోవా (చెక్) ద్వయంపై నెగ్గి తుదిపోరుకు అర్హత సాధించింది.
గంటా 24 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో.. తొలి సెట్ హోరాహోరీగా సాగగా.. రెండో సెట్‌లో సానియా జంటకు పోటీనే లేకుండా పోయింది.

