తాజావార్తలు
సహకార చట్టాలపై అవగాహన అవసరం

- డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావు
సుబేదారి, జనవరి 21 : బ్యాంకును పటిష్టం చేయడం తో పాటు రైతులకు సేవలు అందించేందుకు సంఘాల సభ్యులు అంకితభావంతో పనిచేయాలని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావు అన్నారు. సహకార చట్టాలపై పీఏసీఎస్ చైర్మన్లకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ తరగతులు నక్కలగుట్టలోని ఓ హోటల్‌లో గురువారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు సంఘాల పటిష్టత, రైతులకు అందించాల్సిన సేవలపై చర్చించారు. ఈ సందర్భంగా రవీందర్‌రావు మాట్లాడుతూ.. సహకార చట్టాలపై ప్రతి సభ్యుడు అవగాహన కలిగి ఉండాలన్నారు. పీఏసీఎస్‌లు పటిష్టంగా ఉంటేనే డీసీసీబీ ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు.
నాబార్డు రుణాలతో గోదాముల నిర్మాణం, పెట్రోల్‌బంకులు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా పీఏసీఎస్‌లు అభివృద్ధి చెందాలన్నారు. సంఘాల చైర్మన్లు రైతులకు సేవలందిస్తూనే, సంఘాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. అక్రమాలకు తావులేకుండా.. పారదర్శకంగా రైతులకు సేవలందించాలన్నారు.
డీసీసీబీ ఆధ్వర్యంలో విద్య, గోల్డ్, హౌసిం గ్, ఇతర రుణాలు తక్కువ వడ్డీకి ఇస్తున్నట్లు చెప్పారు. కమర్షియల్ బ్యాంకులకు దీటుగా డీసీసీబీని అభివృద్ధి పథంలో తీసుకెళ్లనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సీటీఐ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు సహకార చట్టాలపై పవర్‌పాయింట్‌ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. సమావేశంలోసీఈవో చిన్నారావు, నాబార్డు ఏజీఎం చంద్రశేఖర్, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, డైరెక్టర్లు కంది శ్రీనివాస్‌రెడ్డి, దొంగల రమే శ్, ఉపేందర్‌రెడ్డి, నాయిని రంజిత్, యాదగిరిరెడ్డి, ఎలుగం రవిరాజ్, వరంగల్ అర్బన్ డీసీవో నీరజ, బ్యాంకు డీజీఎం అశోక్, ఉషశ్రీ, ఏజీఎం మధు, స్రవంతి, పీఏసీఎస్ చైర్మన్లు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
related stories
-
హైదరాబాద్ 25 రోజులు.. రూ.28 కోట్ల రుణాలు
-
ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు శ్వేత విజయాన్ని కాంక్షిస్తూ కలిసి పని చేస్తాం: బోండ ఉమ
-
ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు జమ్మలమడుగులో వైసీపీ ఎమ్మెల్యే ఆఫీసు ముట్టడి