శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌లో భారీ వర్షాల మధ్య శ్రీమాతా వైష్ణోదేవి యాత్ర సజావుగానే సాగుతోందని దేవస్థానం బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమేశ్ కుమార్ తెలిపారు. వాతావరణశాఖ సూచనల దృష్టిలో పెట్టుకొని ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. కొవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ వైష్ణోదేవి యాత్రకు దేవస్థానం మే నుంచి భక్తులను అనుమతి ఇస్తోంది. ఈ మేరకు అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. అయితే, ఆలయంలోకి ప్రవేశించే ముందు భక్తులు కొవిడ్ నెగెటివ్ ఆర్టీ పీసీఆర్ సర్టిఫికెట్‌ను చూపించాలని నిబంధన విధించింది.
ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
భారత్‌కు విమానాలు నిలిపివేసిన ఎతిహాద్
శ్రీశైలానికి భారీగా వరద.. ఏడు గేట్ల ఎత్తివేత

