Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ..

సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ..

బడంగ్‌పేట,ఏప్రిల్‌ 10: ముఖ్య మంత్రి కేసీఆర్‌ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జల్‌పల్లి మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్‌ మాజీ ఎంపీటీసీలు సయ్యద్‌ అబ్దుల్‌, రవూఫ్‌, మహుద్‌, హైమద్‌, ఔజియా బేగం మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని వి ధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని గుర్తు చేశారు. తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. సీఎం చేపడుతున్న అభివృద్ధిని చూసి ప్రతి పక్షాలు జీర్ణించుకోలేక ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.

మిషన్‌ భగీరథ పథకాన్ని దేశంలో చాలా చోట్ల అమలు చేస్తున్నారని అన్నారు. ప్రతి పక్షాలు పాలిస్తున్న రాష్ర్టాల్లో అభివృద్ధి శూన్యమన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కుల మతాలకతీతంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ కోసం పనిచేస్తున్న వారికి సముచిత స్థానం ఉంటుందన్నారు. కార్యకర్తలకు, పార్టీలో చేరుతున్న వారికి సమన్యాయం చేస్తామన్నారు.

కరోనా కారణంగా పాఠశాలలు బంద్‌ చేయడంతో ప్రైవేట్‌ టీచర్లు ఇబ్బంది పడుతున్నారని గమనించి సీఎం ప్రతి టీచర్‌కు రెండువేల రూపాయలు, 25 కిలోల బియ్యం ఇస్తున్నారని తెలిపారు. గతంలో లాక్‌ డౌన్‌ కాలంలో తెలంగాణ ప్రజలతో పాటు, వలస కార్మికులను ప్రభు త్వం ఆదుకుందని గుర్తుచేశారు. వలస కార్మికులను స్వస్థలాలకు పంపించాన్నారు. టీఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ అన్నారు. కేసీఆర్‌ నాయకత్వం పై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. జల్‌పల్లి అభివవృద్ధికి పాటు పడుతామన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఇక్బాల్‌ బిన్‌ ఖలీఫా, కౌన్సిలర్‌ శంషొద్దీన్‌, మహబూబ్‌ హసన్‌ బాబా, లలిత జగన్‌, అబ్దుల్లా బిన్‌ ఖ లీద్‌,సాజీద్‌, బేగం, అంజిత్‌, ఫైసల్‌ ఖాన్‌ పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana