Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Santosh Nagar Steel Flyover | కేసీఆర్‌ మార్కు వారధి.. నేడు సంతోష్‌నగర్‌ బ్రిడ్జి ప్రారంభం

Santosh Nagar Steel Flyover | కేసీఆర్‌ మార్కు వారధి.. నేడు సంతోష్‌నగర్‌ బ్రిడ్జి ప్రారంభం

సిటీబ్యూరో : మహానగరంలో రవాణా విప్లవం, విశ్వనగర ప్రస్థానానికి నిలువెత్తు సాక్ష్యమైన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డీపీ) ఫలాలు ఒక్కొక్కటిగా గ్రేటర్‌ సిగలో చేరుతున్నాయి.

తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యమై, నాటి బీఆర్‌ఎస్‌ పాలనలో రూపుదిద్దుకున్న మరో ప్రతిష్టాత్మకమైన వంతెన ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. చంచల్‌గూడ జైలు కూడలి నుంచి సంతోష్‌నగర్‌ వరకు రూ.620 కోట్ల అంచనా వ్యయంతో 3.32 కిలోమీటర్ల పొడవున 85 పిల్లర్లపై నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జిని గురువారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారు.

ఈ ఫె్లైఓవర్‌ అందుబాటులోకి వస్తే నల్గొండ ఎక్స్‌ రోడ్స్‌ నుంచి ఒవైసీ హాస్పిటల్‌ వరకు ఉన్న మూడు ప్రధాన సిగ్నల్స్‌ బాధ తప్పనున్నది. తద్వారా 90 శాతం ట్రాఫిక్‌ సమస్యలు పరిషారం కానున్నాయి. సైదాబాద్‌ జంక్షన్‌లో చంచల్‌గూడ నుంచి చంపాపేట్‌కు వెళ్లే వాహనాలకు ఓ డౌన్‌ ర్యాంపును, సైదాబాద్‌ నుంచి జంక్షన్‌లో ఫ్లై ఓవర్‌ ఎక్కి చంచల్‌గూడ వైపు వెళ్లేందుకు మరో అప్‌ ర్యాంపును నిర్మించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana