Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సపోర్ట్‌ తాడును కోసిన మహిళ.. ఎత్తైన భవనంపై వేలాడిన పెయింటర్స్‌

సపోర్ట్‌ తాడును కోసిన మహిళ.. ఎత్తైన భవనంపై వేలాడిన పెయింటర్స్‌

బ్యాంకాక్: ఎత్తైన బిల్డింగ్‌కు పెయింట్‌ వేస్తుండగా ఒక మహిళ తన ఇంటి మీదుగా వెళ్తున్న సపోర్ట్‌ తాడును కోసేసింది. దీంతో ఇద్దరు పెయింటర్లు 26వ అంతస్తు పైనుంచి ప్రమాదకరంగా వేలాడారు.

థాయిలాండ్‌లోని పాక్ క్రెట్‌లో ఈ ఘటన జరిగింది. బుధవారం బహుళ అంతస్తుల నివాసిత భవనం వెలుపల పెయింట్‌ వేసేందుకు ఇద్దరు వ్యక్తులు సపోర్ట్‌ తాడు సహాయంతో 32వ అంతస్తు నుంచి పెయింట్‌ వేస్తూ కిందకు దిగుతున్నారు.

అయితే తమ ఫ్లోర్‌లో పెయింట్‌ వేస్తున్న సంగతి చెప్పకపోవడంపై ఒక మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన ఇంటి మీదుగా వెళ్తున్న సపోర్ట్‌ తాడును చాకుతో కోసివేసింది. దీంతో ఆ పెయింటర్లు 26వ అంతస్తుపైన గాల్లో వేలాడసాగారు. కిటికీ తెరువాలని అరిచారు. గమనించిన ఒక జంట వారికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో వారి ఇంటి బాల్కానీలోకి ఆ పెయింటర్లు సురక్షితంగా చేరుకున్నారు.

మరోవైపు సపోర్ట్‌ తాడును కోసిన మహిళను స్థానిక పోలీసులు అరెస్ట్‌ చేశారు. హత్యా యత్నం, ఆస్తికి నష్టం కలిగించడం వంటి ఆరోపణలపై కేసు నమోదు చేశారు. అయితే ఆ మహిళ తొలుత ఈ ఆరోపణలను ఖండించింది. దీంతో తెగిన తాడును ఫింగర్‌ ప్రింట్, డీఎన్‌ఏ అనాలిసిస్‌ కోసం ల్యాబ్‌కు పంపారు. చివరకు ఆ మహిళ తన తప్పును అంగీకరించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana