Sarojini Devi Eye Hospital | తెలంగాణ వ్యాప్తంగా దీపావళి( Dipavli festival)సంబురాలు అంబరాన్నంటాయి. చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ పటాకులు(Firecrackers) కాల్చుతూ ఆనందంగా గడిపారు.
ఈ వెలుగుల పండుగ కొందరి జీవితాల్లో విషాదాన్ని మిగిల్చింది. బాంబులు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. జాగ్రత్తలు తీసుకోకుండా పటాకులు కాల్చడంతో పలువురు ప్రమాదాలకు గురయ్యారు. దీంతో బాధితులు హైదరాబాద్ మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి దవాఖాన (Sarojini Devi Eye Hospital) వద్ద బారులు తీరారు.
నవంబర్ 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు నమోదైన బాధితుల వివరాలను దవాఖాన వైద్యులు వెల్లడించారు. ఇప్పటివరకు 48 మంది గాయాలతో హాస్పిటల్కు వచ్చారు. వీరిలో 38 మంది అవుట్ పేషెంట్లు.. మరో 10 మంది ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నట్లు వైద్యులు చెప్పారు.

