Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
School Bus Accident | పులివెందులలో స్కూల్‌ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. రన్నింగ్‌లో ఉండగా ఊడిన రెండు టైర్లు.. !

School Bus Accident | పులివెందులలో స్కూల్‌ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. రన్నింగ్‌లో ఉండగా ఊడిన రెండు టైర్లు.. !

School Bus Accident | కడప జిల్లా పులివెందులలో సోమవారం ఓ స్కూల్ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులను తీసుకుని పాఠశాలకు వెళ్తున్న సమయంలో బస్సు వెనుక టైర్లు రెండు ఒక్కసారిగా ఊడిపోయాయి.

అయితే డ్రైవర్ అప్రమత్తతో విద్యార్థులంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు.

ఈ ఘటనతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బస్సు నిర్వహణలో నిర్లక్ష్యం ఉందా? మరేదైనా సాంకేతిక లోపం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో స్కూల్ బస్సుల ఫిట్‌నెస్, భద్రతా ప్రమాణాలపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana