Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సెమీస్‌లో సాత్విక్‌-చిరాగ్‌.. సింధు, లక్ష్యసేన్‌ ఓటమి

సెమీస్‌లో సాత్విక్‌-చిరాగ్‌.. సింధు, లక్ష్యసేన్‌ ఓటమి

సింగపూర్‌ : సింగపూర్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత జోడీలు సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి, ధ్రువ్‌ కపిల-తనీషా క్రాస్టో సెమీస్‌ చేరాయి.

సింగిల్స్‌లో పీవీ సింధు, లక్ష్యసేన్‌ క్వార్టర్‌ ఫైనల్లోనే ఓడిపోయారు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో నాలుగో సీడ్‌ సాత్విక్‌-చిరాగ్‌ ద్వయం 19-21, 21-17, 21-13తో మలేషియాకు చెందిన కాంగ్‌ ఖై క్సింగ్‌-ఆరోన్‌ తాయ్‌పై విజయం సాధించింది.

ఇక, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల-తనీషా క్రాస్టో జోడీ తొలి గేమ్‌లో 16-18తో నిలిచిన దశలో ప్రత్యర్థి చెన్‌ టాంగ్‌ జీ- తొయి వీ (మలేసియా) గాయం కారణంగా తప్పుకోవడంతో భారత జంటకు వాకోవర్‌ విజయం లభించింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ 19-21, 21-15, 15-21 తేడాతో వాతనాబే (జపాన్‌) చేతిలో ఓడగా.. మహిళల క్వార్టర్స్‌లో సింధు 17-21, 14-21తో ప్రపంచ నం.1 అన్‌ సే యంగ్‌ (కొరియా) చేతిలో ఓడింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana