షాద్‌నగర్ టౌన్: కరోనా నేపథ్యంలో వాయిదా పడిన పది పరీక్షలు ఈ నెల 8 నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా పట్టణంలోని పరీక్షా కేంద్రాల్లో స్వల్ప మార్పులు చేసినట్లు ఎంఈవో శంకర్‌రాథోడ్ గురువారం తెలిపారు. షాద్‌నగర్ పట్టణంలో తొమ్మిది పరీక్ష కేంద్రాలు ఉండగా నూతనంగా మరో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఒక్కొక్క పరీక్షా కేంద్రంలో 250 నుంచి 300 మం ది పరీక్షలు రాస్తుండగా ప్రస్తుతం 140 నుంచి 200 లోపే విద్యార్థులు పరీక్షలు రాసే విధంగా చర్యలు తీసుకుంటున్నా మని తెలిపారు.
పట్టణంలోని ఓంకార్, కాకతీయ, భాష్యం ప్రాథమిక పాఠశాల, మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాత బిల్డింగ్‌లో నూతనంగా పరీక్ష కేంద్రాలను ఏ ర్పాటు చేశామన్నారు.
అదేవిధంగా మున్సి పాల్టీలోని ఫరూఖ్‌నగర్‌లో కంటైన్మెంట్ జోన్‌గా గుర్తించడంతో అక్కడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని పూర్తిగా పట్ట ణంలోని ఠాగూర్ పాఠశాలకు మార్చినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రహించాలని కోరారు. ఉపాధ్యాయులు తమ విద్యార్థులను పరీక్షా సమ యానికి గంట ముందుగా పరీక్షా కేంద్రానికి తీసుకురావా లని సూచించారు. మిగతా విద్యార్థులకు మొదట ఉన్న పరీ క్షా కేంద్రంలోనే పరీక్ష ఉంటుందన్నారు.
షాబాద్ మండలంలో..
షాబాద్: షాబాద్ మండలంలోని జడ్పీహెచ్‌ఎస్ బాలుర ఉన్నత పాఠశాలలో పరీక్ష రాసే వంద మంది విద్యార్థులకు హాల్ టికెట్ నంబర్ 2023132507 నుంచి 202313 2606 వరకు నవజీవన్ పాఠశాలకు పరీక్ష కేంద్రాన్ని మార్చినట్లు మండల విద్యాధికారి శంకర్‌రాథోడ్ తెలిపారు. మిగ తా పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి మార్పు లేదన్నారు.

