హైదరాబాద్, అక్టోబర్ 31: ఇండిగోరీచ్.. హైదరాబాద్ సమీపంలోని షాద్‌నగర్ వద్ద ఇండిగోరీచ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించింది. ప్రముఖ ఎన్జీవో సంస్థ ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్‌తో కలిసి నెలకొల్పింది.
గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఆదాయం కలిగిన వారిని ప్రత్యేకంగా ఎంపిక చేసుకొని వారికి ఆతిథ్య రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ సెంటర్‌ను నెలకొల్పినట్టు, తద్వారా వచ్చే మూడేండ్లలో 5 వేల మందికి శిక్షణ ఇవ్వనున్నట్టు ఇంటర్‌గ్లోబ్ ఫౌండేషన్ చైర్పర్సన్ రోహిణి తెలిపారు.

