Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
షాహిద్ అఫ్రిది కూతురిని పెళ్లి చేసుకోనున్న పాక్ పేసర్‌!

షాహిద్ అఫ్రిది కూతురిని పెళ్లి చేసుకోనున్న పాక్ పేసర్‌!

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కూతురిని ఆ టీమ్ పేస్ బౌలర్ షహీన్ షా అఫ్రిది పెళ్లి చేసుకోనున్నాడు. ఈ మేరకు షహీన్ షా కుటుంబ సభ్యులు తమ కుటుంబాన్ని కలిసి మాట్లాడినట్లు అఫ్రిది ట్విటర్ ద్వారా వెల్లడించాడు. పెళ్లిళ్లు స్వర్గంలోనే నిశ్చయమవుతాయంటూ అఫ్రిది ఆ ట్వీట్‌లో కామెంట్ చేశాడు. నా కూతురు కోసం షహీన్ కుటుంబం మా కుటుంబాన్ని అడిగారు. రెండు కుటుంబాలు ఈ విషయంపై మాట్లాడుకుంటున్నాయి. పెళ్లిళ్లు స్వర్గంలోనే నిశ్చయమవుతాయి. అల్లా దయతలిస్తే వీళ్ల పెళ్లి కూడా జరుగుతుంది. షహీన్ ఫీల్డ్ లోపల, బయట సక్సెస్ కావాలని నేను ప్రార్థిస్తున్నాను అని అఫ్రిది ట్వీట్ చేశాడు.

అదే ఏడాది వన్డేలు, టెస్టుల్లోనూ ఆడాడు. 22 టీ20ల్లో 24 వికెట్లు, 21 వన్డేల్లో 45 వికెట్లు, 15 టెస్టుల్లో 48 వికెట్లు తీశాడు. షహీన్‌తోపాటు షాహిద్ అఫ్రిది కూడా ఈ మధ్యే వాయిదా పడిన పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడటం విశేషం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana