Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శంకుస్థాపనలు మళ్లీ మళ్లీ.. వాటి నిర్మాణానికి బీఆర్‌ఎస్‌ హయాంలోనే భూమిపూజ

శంకుస్థాపనలు మళ్లీ మళ్లీ.. వాటి నిర్మాణానికి బీఆర్‌ఎస్‌ హయాంలోనే భూమిపూజ

  • నేడు యాదగిరిగుట్టలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
  • వేద పాఠశాల, కల్యాణ మంటపానికి మళ్లీ శంకుస్థాపన

యాదాద్రి భువనగిరి, మే 22 (నమస్తే తెలంగాణ) : వ్యక్తిగత ప్రచారం కోసం వెంపర్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి 'నవ్విపోదురుగాక నాకేటి' అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో మంజూరై, శంకుస్థాపనలు పూర్తయిన ప్రాజెక్టులకే మళ్లీ భూమి పూజలు చేసే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ఆదివారం యాదగిరిగుట్టలో పర్యటించనున్న రేవంత్‌రెడ్డి.. గతంలో అక్కడ శంకుస్థాపన చేసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి వే దపాఠశాల, కల్యాణ మంటపానికే ఆదివారం పునాది రాయి వేసేందుకు సిద్ధమయ్యారు.

2023లోనే వేద పాఠశాలకు శంకుస్థాపన

గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం దాదాపు రూ.1,200 కోట్లతో యాదాద్రి ఆలయాన్ని వెయ్యేండ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండేలా అద్భుతంగా పునర్నిర్మించింది. 17 ఎకరాల్లో గుడిని విస్తరించింది. రాయగిరి రైల్వే స్టేషన్‌ సమీపంలోని వేంకటేశ్వరస్వామి కోనేరు వద్ద 16 ఎకరాల్లో వేదపాఠశాల నిర్మాణ పనులకు 2023 జూన్‌ 21న నాటి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు అదే వేదపాఠశాలకు సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి భూమిపూజ చేయనున్నారు. గతంలో రాయగిరి వద్ద ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన వేదపాఠశాలను ఇప్పుడు టెంపుల్‌ సిటీపైకి మార్చారు. గతంలో బాలాలయం ఉన్న చోట కల్యాణ మంటపం నిర్మించాలని నిర్ణయించడంతో అప్పుడే అక్కడ శంకుస్థాపన చేశారు. వైకుంఠ మార్గం నుంచి కొండపైకి వెళ్లే నడకదారిలో పైకప్పు, మాఢ వీధుల్లోకి వెళ్లేందుకు మెట్ల మార్గం ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్‌ హయాంలోనే నిర్ణయించారు.

గతంలోనూ ఇదే తంతు

సీఎం రేవంత్‌రెడ్డి నిరుడు జూన్‌ 6న తుర్కపల్లి మండలంలో పర్యటించినప్పుడు కూడా బీఆర్‌ఎస్‌ హయాంలో మంజూరైన, శంకుస్థాపన చేసిన పనులకే మళ్లీ పునాదిరాయి వేశారు. యాదగిరిగుట్టలో మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు 2023 జూలై 6న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ జీవో 85 విడుదల చేసింది. ఇదే కాలేజీకి రేవంత్‌రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఆలేరు మండలంలోని కొలనుపాక, రాజాపేట మండలంలోని కాల్వపల్లిలో హైలెవల్‌ బ్రిడ్జిల నిర్మాణానికి బీఆర్‌ఎస్‌ హయాంలో నాటి ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి శంకుస్థాపన చేసిన పనులకు సైతం రేవంత్‌రెడ్డి మళ్లీ భూమిపూజ చేశారు. ఆయన శంకుస్థాపన చేసిన గంధమల్ల రిజర్వాయర్‌ కూడా బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రతిపాదించినదే. సీఎం హోదాలో మూడుసార్లు యాదగిరిగుట్టలో పర్యటించిన రేవంత్‌రెడ్డి ఇప్పటి వరకు ఒక్కపైసా ఇవ్వలేదు. యాదగిరిగుట్ట పాలక మండలి, గోశాల పాలసీ తీసుకొస్తామని చెప్పి చేతులు దులిపేసుకున్నారు.

ఎస్టీ కమిషన్‌కు ప్రత్యేక హోదా కల్పించండి

హైదరాబాద్‌, మే 22 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ నుంచి ఎస్టీ కమిషన్‌ను వేరు చేసి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం రే వంత్‌రెడ్డికి లంబాడీ ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం ని వాసంలో వారు రేవంత్‌ను కలిశారు. లంబాడీల గురువు పేరుతో 'సంత్‌ సేవాలాల్‌ కార్పొరేషన్‌’ ఏర్పాటు చేయాలని కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana