Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శిశువుకు ప్రాణం పోశారు

శిశువుకు ప్రాణం పోశారు

  • l పెద్ద తలతో జన్మించిన శిశువుకు మెరుగైన వైద్యం
  • l చికిత్స అందించిన ఉస్మానియా, నిలోఫర్‌ వైద్యులు

భీంపూర్‌: పెద్ద తలతో జన్మించి బతుకడమే కష్టమైన ఓ శిశువుకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు నిలిపారు ఉస్మానియా, నిలోఫర్‌ వైద్యులు. ఆదిలాబాద్‌ జిల్లా భీం పూర్‌ మండలం కరంజి(టి) పంచాయతీ పరిధి రాజులవాడి గిరిజన పల్లెకు చెందిన కుడిమెత సువర్ణ ఈ నెల 26న ఆదిలాబాద్‌ రిమ్స్‌లో అమ్మాయికి జన్మనిచ్చింది. అయితే, శిశువు తల పెద్దగా ఉండటంతో పరీక్షించిన వైద్యులు హైడ్రోసెఫాలన్‌ వ్యాధిగా గుర్తించారు. అదేరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించారు. వైద్యులు పాప తలలోంచి నీరు తొలిగించగా.. ప్రస్తుతం నిలోఫర్‌లో చికిత్స అందిస్తున్నారు.

రెండురోజుల్లోగా సర్జరీ చేసే అవకాశం ఉన్నట్లు భీంపూర్‌ వైద్యాధికారి విజయసారథి తెలిపారు. బతకడమే కష్టమనుకున్న తరుణంలో ఉస్మానియా, నిలోఫర్‌ వైద్యులు మెరుగైన వైద్యం అందించారన్నారు. పీహెచ్‌సీ, కరంజి(టి) ఉప కేంద్రం సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో ఐదురోజుల ముందే సువర్ణను రిమ్స్‌లో చేర్పించడంతో తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana