Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Shiva Kumar | డబ్బు తీసుకోకుండా ప్రజలు ఓటేశారు.. విజయ్ విజయంపై సూర్య తండ్రి శివకుమార్ ప్రశంసలు

Shiva Kumar | డబ్బు తీసుకోకుండా ప్రజలు ఓటేశారు.. విజయ్ విజయంపై సూర్య తండ్రి శివకుమార్ ప్రశంసలు

Thalapathy Vijay | తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి, తొలి ఎన్నికల్లోనే ఘనవిజయం సాధించి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోవడంపై కోలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు స్పందిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా సీనియర్ నటుడు, స్టార్ హీరోలు సూర్య, కార్తీల తండ్రి శివకుమార్ కూడా విజయ్ విజయంపై స్పందిస్తూ విజయ్ గెలుపుపై ప్రశంసలు కురిపించాడు.

ఇటీవల కోయంబత్తూరులోని ఒక ఆసుపత్రి వేడుకలో పాల్గొన్న శివకుమార్.. నటుడు సత్యరాజ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విజయ్ ముఖ్యమంత్రి కావడంపై, ఆయన సాధించిన భారీ విజయంపై శివకుమార్ మాట్లాడుతూ.. మన రాజకీయ చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే.. కామరాజ్ తొమ్మిదేళ్లపాటు జైలు జీవితం గడిపారని, ఆ తర్వాత తొమ్మిదేళ్లపాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా సేవలు అందించారని గుర్తుచేశారు. అయినా సరే ఆయన ఎన్నికల్లో ఓడిపోయారని, ఆయన మరణించినప్పుడు ఆయన దిండు కింద కేవలం రూ. 140, ఐదారు పుస్తకాలు, రెండు జతల చెప్పులు, నాలుగు లేదా ఐదు కుర్తాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. అలాంటి నాయకుడిని ఈ రోజుల్లో చూడగలమా అని ప్రశ్నించిన ఆయన, అంతటి గొప్ప నాయకుడిని కూడా ప్రజలు ఓడించారని పేర్కొన్నారు. ఆ తర్వాత ద్రవిడ పార్టీలు దాదాపు 60 ఏళ్లపాటు రాష్ట్రాన్ని పాలించాయని, అయితే ప్రస్తుతం ప్రజలు డిఎంకె లేదా అన్నాడిఎంకెలను కోరుకోవడం లేదని, అందుకే విజయ్‌కు ఓటు వేసి గెలిపించారని స్పష్టం చేశారు. అధికారంలో ఎవరు ఉండాలనేది ప్రజలే నిర్ణయిస్తారని, ఈ ఎన్నికల్లో ఓటు వేసిన వారిలో 90 శాతం మంది యువకులేనని, వారంతా రూపాయి కూడా డబ్బు తీసుకోకుండా ఓటేశారని శివకుమార్ ప్రశంసించారు.

తన మనవడు (సూర్య కుమారుడు) కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేశాడని, యువతే ఈ దేశ భవిష్యత్తు అని అన్నారు. ప్రజలు మార్పును కోరుకున్నారని, వారు తమ నాయకుడిని ఎన్నుకున్నప్పుడు అది తప్పని చెప్పడానికి మనం ఎవరమని వ్యాఖ్యానించారు. విజయ్ ప్రజలకు మంచి చేస్తాడని ఆశిస్తున్నానని, ఆయన విజయం సాధించడం పట్ల తనకు ఎంతో సంతోషంగా ఉందని శివకుమార్ తెలిపారు. కాగా, శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో ఆయన పక్కనే ఉన్న నటుడు సత్యరాజ్ తీవ్ర డిఎంకె మద్దతుదారుడు కావడం గమనార్హం. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో డిఎంకె ఓటమి పాలైన తర్వాత సత్యరాజ్ ఒక వీడియోను విడుదల చేస్తూ, గత ఐదేళ్లుగా తాను ద్రవిడ మోడల్ ప్రభుత్వానికి, ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్‌కు మద్దతుదారుడిగా ఉన్నానని, రాబోయే రోజుల్లో కూడా స్టాలిన్‌కు, డిఎంకె పార్టీకి తన మద్దతు మరింత బలంగా ఉంటుందని గర్వంగా, నమ్మకంగా ప్రకటిస్తున్నానని పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana