Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీకాంత్‌ బోణీ తొలి రౌండ్‌కే లక్ష్యసేన్‌ నిష్క్రమణ

శ్రీకాంత్‌ బోణీ తొలి రౌండ్‌కే లక్ష్యసేన్‌ నిష్క్రమణ

షెన్‌జెన్‌: చైనా మాస్టర్స్‌లో భారత స్టార్‌ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్‌, సాత్విక్‌-చిరాగ్‌ శుభారంభం చేయగా.. లక్ష్యసేన్‌ మొదటి రౌండ్‌లోనే ఇంటిబాట పట్టాడు.

బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలిరౌండ్‌లో శ్రీకాంత్‌ 21-16, 21-15తో చైనీస్‌ తైపీకి చెందిన చి యు జెన్‌ను వరుస గేమ్స్‌లో ఓడించాడు. కానీ లక్ష్యసేన్‌ 14-21, 7-21తో ప్రపంచ 9వ నంబర్‌ ఆటగాడు విక్టర్‌ లై (కెనడా) జోరు ముందు తేలిపోయాడు. డబుల్స్‌లో సాత్విక్‌ జోడీ.. 21-11, 21-16తో జునైది అరిఫ్‌-కాంగ్‌ ఖాయ్‌ జింగ్‌ (మలేషియా)పై అలవోక విజయం సాధించింది. గత నెల తైపీ ఓపెన్‌ గెలిచిన జోష్‌లో ఉన్న తన్వి శర్మ 21-16, 21-17తో అమేలీ (డెన్మార్క్‌) ఓడించగా, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధృవ్‌ కపిల-తనీషా జోడీ కూడా ముందంజ వేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana