హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప లౌకికవాది, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తారని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కొత్త సచివాలయంలో ప్రార్థనా మందిరాలను నిర్మించే విషయమై మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన సెక్రటేరియట్‌లో బుధవారం సమావేశం జరిగింది. హోం మంత్రి, పశుసంవర్ధక శాఖల మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లతో కలిసి కొప్పుల ముస్లిం మత ప్రతినిధులు, క్రిస్టియన్, హిందూ మతాల ప్రతినిధులు, సెక్రటేరియట్ ఉద్యోగులతో చర్చించారు.
కొత్తగా కడుతున్న సచివాలయంలో గుడి, మసీదు, చర్చిల నిర్మాణ ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..

