Wednesday, 21 Apr, 12.39 am నమస్తే తెలంగాణ

తాజావార్తలు
సీఎం కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని పూజలు

బొడ్రాయిబజార్‌, ఏప్రిల్‌ 20 : తెలంగాణ జాతిపిత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనా మహమ్మారి నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకుడు ఎల్గూరి రామాకిరణ్‌గౌడ్‌ మాట్లాడుతూ నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న దేవుడు కేసీఆర్‌ అన్నారు. మనసున్న ముఖ్యమంత్రి త్వరగా కోలుకోవాలని, మహమ్మారి కరోనా కూకటివేళ్లతో అంతరించిపోవాలని వేడుకున్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్వీ నాయకులు ఎస్‌కే రఫీ, గట్ల శ్రవణ్‌కుమార్‌, సోమగాని వేణుగౌడ్‌, మద్దికుంట చింటు, సైదానాయక్‌, మణి, వీరాంజనేయులు, ఆర్‌కే గౌడ్‌, శీలం రాముగౌడ్‌, బచ్చలకూరి సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

రామగిరి : కరోనా నుంచి సీఎం కేసీఆర్‌ త్వరగా కోలుకోని కోరుతూ ఐసీడీఎస్‌ ఆర్వో మాలె శరణ్యారెడ్డి పానగల్‌రోడ్డులోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలంతా కేసీఆర్‌ త్వరగా కొలుకోవాలని కోరుతున్నారని వెల్లడించారు. తులసీనగర్‌ శ్రీభక్తాంజనేయ ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్‌ నేలపట్ల రమేశ్‌ ఆధ్వర్యంలో అర్చకులు సీఎం కేసీఆర్‌ గోత్రనామాలతో అర్చన చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు కూరెళ్ల రమణాచారి, రూపేందర్‌, మేనేజర్‌ రుద్ర వెంకటేశం, అర్చకులు హరీశ్‌శర్మ, హనుమంతాచార్యులు, చంద్రశేఖరశాస్త్రి, భక్తులు పాల్గొన్నారు. టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున బీట్‌మార్కెట్‌లోని ఉమామహేశ్వరాలయంలో పూజలు చేశారు. పాతబస్తీ శ్రీభక్తాంజనేయ సహిత సంతోషిమాత ఆలయంలో కమిటీ చైర్మన్‌ లకడాపురం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పూజలు చేశారు. కార్యక్రమంలో అర్చకులు కారంపూడి మోహనాచార్యులు, ధర్మకర్తలు పాల్గొన్నారు.

హుజూర్‌నగర్‌ : హుజూర్‌నగర్‌లోని ఉస్మానియా మసీద్‌లో ముస్లిం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. టీఆర్‌ఎస్‌ మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు బాజీఉల్లా మాట్లాడుతూ ముస్లింల అభివద్ధి కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌ త్వరగా కోలుకొని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థించినట్లు తెలిపారు. సయ్యద్‌ సాధిక్‌, షఫీ, జిలానీ, సద్దాం, నిరాజ్‌, బాబా, ఇమ్రాన్‌, ఇబ్రహీం పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana
Top