Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీఎం సభకు బస్సులు.. ప్రయాణికులకు తిప్పలు

సీఎం సభకు బస్సులు.. ప్రయాణికులకు తిప్పలు

  • స్పెషల్‌ బస్సుల్లో మంచిర్యాల నుంచి చెన్నూర్‌కు రూ.100 వసూలు

మంచిర్యాలటౌన్‌, జూన్‌ 1: ఆసిఫాబాద్‌ జిల్లాలో సీఎం సభకు జనాలను తరలించడం కోసం ఆర్టీసీ బస్సులన్నీ బుక్కయ్యాయి.

సోమవారం మంచిర్యాల నుంచి చుట్టు పక్కల ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలకు నడుపుతున్న బస్సుల్లో మంచిర్యాల నుంచి చెన్నూర్‌కు ప్రయాణిస్తే చార్జీ రూ. 100 వసూలు చేశారు. సాధారణంగా పల్లె వెలుగు బస్సు రూ.రూ. 50, ఎక్స్‌ప్రెస్‌కు రూ. 60 వసూలు చేస్తారు. ఈ విషయమై డీఎం శ్రీనివాసులును అడగగా కాళేశ్వరానికి స్పెషల్‌ బస్సులు నడుపుతున్నామని, వాస్తవానికి చెన్నూరు నడిపేందుకు బస్సులు లేవని, ఉన్న బస్సులు సీఎం ప్రోగ్రామ్‌కు పంపినట్లు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana