Dailyhunt
'సింగిల్‌స్క్రీన్‌ థియేటర్లను ఆదుకోవాలి'

'సింగిల్‌స్క్రీన్‌ థియేటర్లను ఆదుకోవాలి'

హైదరాబాద్‌, మార్చి 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు మూసివేసే స్థితిలో ఉన్నాయని, పార్కింగ్‌ చార్జీలను వసూ లు చేసుకొనే వెసులుబాటు కల్పించి ఆదుకోవాలని తెలంగాణ చలనచిత్ర వాణిజ్యమండలి కార్యదర్శి సునీల్‌నారంగ్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ ఫిలిం చాంబర్‌ నిర్వహించిన సమావేశంలో ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ సెక్రటరీ విజయేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమకు, థియేటర్ల సంక్షేమానికి విద్యుత్తు బిల్లుల మాఫీ, టికెట్ల రేట్ల పెంపు, షోలు పెంచుకునే వెసులుబాటు ఇవ్వాలని కోరారు. సమావేశంలో ఫిల్మ్‌ చాంబర్‌ అధ్యక్షుడు మురళీమోహన్‌, ఎగ్జిబిటర్‌ గోవిందరాజ్‌తోపాటుజిల్లాల ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana