Dailyhunt
Sircilla | సిరిసిల్ల జిల్లాలో ఏకంగా ఏటీఎం మిషన్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు.. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఘటన!

Sircilla | సిరిసిల్ల జిల్లాలో ఏకంగా ఏటీఎం మిషన్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు.. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఘటన!

Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏకంగా ఎస్‌బీఐ ఏటీఎం మిషన్‌ను ఎత్తుకెళ్లారు. శనివారం తెల్లవారుజామున ఏటీఎం మిషన్‌లోని నుంచి డబ్బులు తీసేయందుకు యత్నించారు.

కానీ కుదరలేదు. దీంతో ఏకంగా ఏటీఎం మిషన్‌నే పెకిలించి, వాహనంలో తీసుకెళ్లిపోవడం స్థానికంగా కలకలం రేపుతోంది.

కాగా, పోలీస్ స్టేషన్‌కు కేవలం కూతవేటు దూరంలోనే ఉన్న ఏటీఎం కేంద్రం నుంచి దొంగలు మిషన్‌ను ఎత్తుకెళ్లడం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏటీఎం చోరీపై సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ మహేశ్ బీ గీతే, డీఎస్పీ నాగేంద్రచారి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. దొంగల కోసం డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేయడమే కాకుండా, సీసీ టీవీ కెమెరాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.

Yellareddipet Atm2

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana