తాజావార్తలు
సీసీఎంబీ పరిశోధనలు అభినందనీయం

హైదరాబాద్ : సెంట ర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలర్ బయోలాజీ (సీసీఎంబీ) కేం ద్రంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీసీఎంబీ కొవిడ్-19 నియంత్రణ, పరీక్షల నిర్వహణకు తక్కువ ఖర్చుతో ప్రజలకు ఎలా అందించాలనే అంశాలపై చేసిన పరిశోధనలు అభినందనీయమన్నారు. సీసీఎంబీ డైరెక్టర్ డా. రాకేష్ మిశ్రా మాట్లాడుతూ.. కొవిడ్-19 సందర్భంగా ఎదురైన సవాళ్లను ఎదుర్కొని పరిశోధనలు సాగించి.. తక్కువ ఖర్చుతో కూడా విధానాలను అమల్లోకి తీసుకువచ్చామన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మహేశ్ భగవత్‌కు మెమొంటోను అందించారు.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana
related stories
-
ప్రధాన వార్తలు ఆచార్య... అదరహో!
-
జిల్లా వార్తలు వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేయాలి
-
జిల్లా వార్తలు పూర్వ విద్యార్ధుల అపూర్వ కలయిక