SLW vs IREW : మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో నిరాశపరుస్తున్న శ్రీలంక కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. సెమీస్ ఆశలు సంక్లిష్టంగా మారిన వేళ చావోరోవే పోరులో ఐర్లాండ్‌ను ఢీ కొడుతోంది.
కౌంటీ గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో లంక కెప్టెన్ చమరి ఆటపట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆడిన మూడు మ్యాచుల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన ఐర్లాండ్ పోతూ పోతూ లంక అవకాశాల్ని దెబ్బతీయాలనుకుంటోంది.
గ్రూప్ బీలోని శ్రీలంక మూడు మ్యాచుల్లో ఒకే విజయంతో సెమీస్ రేసులో వెనకబడింది. హ్యాట్రిక్ విజయాలు సాధించిన వెస్టిండీస్, ఇంగ్లండ్ ఆరేసి పాయింట్లతో టాప్-2లో నిలవగా.. స్కాట్లాండ్‌ను ఓడించిన న్యూజిలాండ్ మూడో స్థానం దక్కించుకుంది. ఇప్పటికే మూడు ఓటములతో టోర్నీ నుంచి వైదొలిగిన ఐర్లాండ్.. లంకపై విజయంతో ఖాతా తెరవాలనే కసితో ఉంది.
శ్రీలంక తుది జట్టు :చమరి ఆటపట్టు(కెప్టెన్), ఇమేష దులానీ, హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, హన్సిమ కరుణరత్నే, కవిష దిల్హరి, నీలాక్షిక సిల్వా, కౌషాని నుత్యాంగన(వికెట్ కీపర్), సుగంధ కుమారి, నిమష మీపగే, మిథాలీ అయోధ్య.
ఐర్లాండ్ తుది జట్టు : అమీ హంటర్(వికెట్ కీపర్), గబి లెవిస్(కెప్టెన్), ఒర్లా ప్రెండెర్గాస్ట్, రెబెక్కా స్టోకెల్, లూయిస్ లిటిల్, లీహ్ పౌల్, అలిసే టెక్టర్, అర్లెనా కెల్లీ, ఐమీ మగీరే, కారా ముర్రే, లారా మెక్‌బ్రైడ్.

