మిల్కీ బ్యూటీ తమన్నా తన స్నేహితురాలు హన్నా ఖాన్ పెళ్లి వేడుక కోసం రీసెంట్‌గా రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్ళింది. అక్కడ హన్నా ఖాన్ మెహందీ, సంగీత్ వేడుకలలో పాల్గొంటూ వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్‌కు థ్రిల్ అందిస్తుంది. పెళ్ళి కుమార్తెకు పోటీగా తమన్నా రెడీ అవుతుంది. నీలం, బంగారు వర్ణం, ఎరుపు రంగు మోడరన్ లెహంగాల్లో తమన్నా అందం అదరహో అనేలా ఉంది. ప్రస్తుతం తమన్నాకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.
తమన్నా సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు చేస్తుంది. తమన్నా నటించిన సీటీమార్ చిత్రం ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఇందులో తమన్నా కోచ్ పాత్రలో కనిపించనుంది.

