Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Software employee | పొరపాటు జరిగి ఉంటే సారీ..! తన భార్య పుట్టిన రోజే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

Software employee | పొరపాటు జరిగి ఉంటే సారీ..! తన భార్య పుట్టిన రోజే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

Software employee | పొరపాటు జరిగి ఉంటే సారీ.. గుడ్‌బై అని భార్యకు మెసేజ్ చేసి తన భార్య పుట్టిన రోజునే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే.. కొత్తగూడెం పట్టణానికి చెందిన ములుగురి రమేష్(40) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తన భార్య రాధికతో కలిసి హైదరాబాద్-కూకట్‌పల్లి దేవినగర్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అయితే భార్య రాధిక జన్మదిన వేడుకల అనంతరం అందరూ కలిసి ట్యాంక్‌బండ్‌కు వెళ్లాలని నిర్ణయించుకోగా, తాను రాలేనని చెప్పి రమేష్ ఇంట్లో ఉండిపోయాడు.

రాధిక తన అక్క, తమ్ముడితో కలిసి ట్యాంక్‌బండ్‌కు వెళ్లగా, “పొరపాటు జరిగి ఉంటే సారీ.. గుడ్‌బై” అంటూ రమేష్‌ రాధిక ఫోన్‌కు మెసేజ్ పంపాడు. ఆందోళనతో ఇంటికి వెళ్లి చూడగా అప్పటికే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న రమేష్‌ను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana