Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్పిరిట్‌లో సైలెంట్‌ వార్‌?

స్పిరిట్‌లో సైలెంట్‌ వార్‌?

దేశవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ నిర్మాణం జరుపుకుంటున్న పానిండియా చిత్రాల్లో ప్రభాస్‌, సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న 'స్పిరిట్‌' చిత్రం ముందు వరుసలో ఉంటుంది.

ఈ ప్రెస్టేజియస్‌ మూవీ కోసం అభిమానులే కాదు, సగటు ప్రేక్షకులు సైతం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పూర్తి కాప్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మునుపెన్నడూ చూడనటువంటి రూత్‌లెస్‌ పోలీస్‌ అవతారంలో ప్రభాస్‌ కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నది.

పోలీస్‌స్టేషన్‌కి సంబంధించిన ఎపిసోడ్‌ని దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నట్లు ఫిల్మ్‌ వర్గాల సమాచారం. ఈ ఎపిసోడ్‌లో యాక్షన్‌ కంటే సైలెన్స్‌తోనే సందీప్‌ భయపెట్టనున్నారట. ఆద్యంతం సీరియస్‌ డ్రామాగా ఈ సీక్వెన్స్‌ సాగుతుందని వినికిడి.

ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఓబెరాయ్‌ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య నడిచే వార్‌ డ్రామా ఉత్కంఠభరితంగా ఉంటుందట. త్రిప్తి డిమ్రీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 5న గ్రాండ్‌గా విడుదల కానున్నది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana