Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
SSC Jobs | 1748 జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల

SSC Jobs | 1748 జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల

SSC Jobs | స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే ఒక ప్రధాన ప్రభుత్వ సంస్థ. ఈ సంస్థ ప్రస్తుతం 1748 జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్‌లు, ఇండియా మెటీయోరాలాజికల్‌ డిపార్ట్‌మెంట్‌ (IMD)లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన, అనుభవం ఉన్నవారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్‌ 22లోగా దరఖాస్తు చేసుకోవాలి.

విభాగాలు
SSC JE 2026 నోటిఫికేషన్‌లోని 1748 జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలను సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, టెలికాం, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ (IMD) విభాగాల్లో భర్తీ చేయనున్నారు. ఇవి గ్రూప్‌-బి లెవల్‌-6 పోస్టులు.

Je Posts

అర్హతలు, వయోపరిమితి
గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి డిప్లొమా, బీస్సీ, బీఈ, బీటెక్ (సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్, టెలికాం, ఆటోమొబైల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ, ఇన్‌స్ట్రుమెంటేషన్‌) ఉత్తీర్ణులైనవారు అర్హులు. దీంతో పాటు పోస్టును బట్టి ఉద్యోగానుభవం కూడా ఉండాలి. వయసు ఈ ఏడాది ఆగస్టు 1 30 నుంచి 32 ఏండ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5, ఓబీసీలకు 3, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

దరఖాస్తు
దరఖాస్తు ఆన్‌లైన్‌లో చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ. 100. ఎస్సటీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.

ఎంపిక
కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (CBT)లో పేపర్‌-1, పేపర్‌ -2 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో నెగెటివ్‌ మార్కింగ్‌లో పేపర్‌-1లో 0.25 మార్కులు, పేపర్‌2లో 1 మార్కు కోత విధిస్తారు. తరువాత డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి జీతం నెలకు రూ. 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. కొన్ని పోస్టులకు మెడికల్‌ ఎగ్జామినేషన్‌లో భాగంగా ఫిజికల్‌ స్టాండర్డ్స్‌ను పరీక్షిస్తారు.

దరఖాస్తులకు చివరితేదీ సెప్టెంబర్‌ 22. ఇతర వివరాలు వెబ్‌సైట్‌ https://ssc.gov.inలో చూడండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana