Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సూచీలకు పశ్చిమాసియా సెగ

సూచీలకు పశ్చిమాసియా సెగ

  • సెన్సెక్స్‌ 374, నిఫ్టీ 141 పాయింట్ల పతనం

ముంబై, సెప్టెంబర్‌ 2: దేశీయ స్టాక్‌ మార్కెట్లకు పశ్చిమాసియా సెగ గట్టిగానే తాకింది. అమెరికా-ఇరాన్‌ దేశాల మధ్య మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకుంటుండటంతో వరుసగా మూడోరోజూ సూచీలు భారీగా నష్టపోయాయి.

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలకు తోడు చమురు ధరలు భగ్గుమననుండటం మదుపర్లను అమ్మకాల వైపు నడిపించాయి.

ఫలితంగా ఇంట్రాడేలో 800 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ సెన్సెక్స్‌ చివరకు మార్కెట్‌ ముగిసే సమయానికి 373.93 పాయింట్లు కోల్పోయి 76,570.35 వద్ద ముగిసింది. వాహన, ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు పోటెత్తాయి. మరోసూచీ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 141.35 పాయింట్లు నష్టపోయి 24 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. చివరకు 23,914.45 వద్ద స్థిరపడింది.

  • ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌, బీఈఎల్‌, ఇన్ఫోసిస్‌, ఎస్బీఐ, ఇండిగో షేర్లు ఒక్క శాతానికి పైగా నష్టపోయాయి.
  • హెచ్‌యూఎల్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతి, భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎటర్నల్‌, టాటా స్టీల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎల్‌అండ్‌టీ, కొటక్‌ బ్యాంక్‌ షేర్లు పతనం చెందాయి.
  • కానీ, అదానీపోర్ట్స్‌, బజాజ్‌ఫిన్‌సర్వ్‌, పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, టైటాన్‌, రిలయ న్స్‌, ట్రెంట్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, సన్‌ఫార్మా, ఐటీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి.
  • రంగాలవారీగా ఆటో సూచీ అత్యధికంగా 1.68 శాతం నష్టపోగా, దీంతోపాటు ఐటీ 1.17 శాతం, ఫోకస్డ్‌ ఐటీ 1.10 శాతం, బీమా 1.09 శతం, క్యాపిటల్‌ గూడ్స్‌ 1.08 శాతం, కన్జ్యూమర్‌ డ్యూరబుల్‌ షేర్లు తగ్గుముఖం పట్టాయి.
  • కానీ, ఎనర్జీ, యుటిలిటీస్‌, పవర్‌, రియల్టీ, సర్వీసెస్‌, హౌజింగ్‌ ఫైనాన్స్‌, పీఎస్‌యూ బ్యాంకింగ్‌ సూచీ లాభాల్లో ముగిశాయి.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana