Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Suryapet | సూర్యాపేట జిల్లాలో బీఆర్‌ఎస్‌ నేత చింతలపాటి మధు దారుణ హత్య

Suryapet | సూర్యాపేట జిల్లాలో బీఆర్‌ఎస్‌ నేత చింతలపాటి మధు దారుణ హత్య

హైదరాబాద్‌ : సూర్యాపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మాజీ సర్పంచ్‌, బీఆర్‌ఎస్‌ నాయకుడు చింతలపాటి మధును గుర్తు తెలియని దుండగులు నరికి చంపారు.

ఈ విషాదకర సంఘటన సూర్యాపేట జిల్లా ఎర్కారంలో చోటు చేసుకుంది. మధును మూడు ముక్కలుగా నరికిన దుండులు గోనె సంచుల్లో కట్టి సమీపంలోని ఎస్పారెస్పీ కెనాల్‌లో పడేశారు.

గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మధు హత్యతో ఎర్కారంలో ఉద్రిక్త పరిస్థితులు నెకలకొన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana