Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సుశీల్‌ లేకుండానే..

సుశీల్‌ లేకుండానే..

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌కు ఆఖరి అవకాశమైన అర్హత టోర్నీ ఎంపికలో భారత స్టార్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌కు చుక్కెదురైంది. సోఫియా (బల్గేరియా) వేదికగా వచ్చే నెల 6న మొదలయ్యే క్వాలిఫయింగ్‌ టోర్నీ కోసం భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) గురువారం ఎంపిక చేసిన జట్టులో సుశీల్‌కు అవకాశం లభించలేదు. పురుషుల 74 కిలోల కేటగిరీలో జాతీయ పసిడి విజేత సందీప్‌ మన్‌ను తప్పిస్తూ అమిత్‌ ధన్కర్‌కు చోటు కల్పించారు. ఫ్రీ స్టయిల్‌ విభాగంలో అమిత్‌తో పాటు సత్యవర్త్‌ కదియాన్‌ (97కి), సుమిత్‌(125కి) ఎంపికయ్యారు. మహిళల కేటగిరీలో సీమ (50కి), నిషా (68కి), పూజ (76కి)ని బీడబ్ల్యూఎఫ్‌ఐ ఎంపిక చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana