- ముళ్లపంది, అడవిపిల్లి కూడా..
పెనుబల్లి: ఖమ్మం జిల్లా పె నుబల్లి మండలం తల్లాడ రేంజ్ తాళ్లపెంట సెక్షన్‌లోని కనకగిరి అటవీప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నది. సమాచారం కోసం తాళ్లపెంట సెక్షన్ గుర్రంగూడెం బీట్‌లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల్లో చిరుతపులితోపాటు ముళ్లపంది, అడవిపిల్లి సంచరిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని డీఆర్వో వెంకటరామారావు, బీట్ అధికారి ఫకీరయ్య తెలిపారు.

