Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టాటా నుంచి నయా ఏరిస్‌.. ప్రారంభ ధర రూ.5.29 లక్షలు

టాటా నుంచి నయా ఏరిస్‌.. ప్రారంభ ధర రూ.5.29 లక్షలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 25: ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటర్స్‌..దేశీయ మార్కెట్లోకి సరికొత్త కారును పరిచయం చేసింది. ఏరిస్‌ పేరుతో విడుదల చేసిన ఈ మాడల్‌ డిజైనింగ్‌, కంఫర్ట్‌, టెక్నాలజీ, నూతన ఫీచర్లు, వ్యక్తిగతంగా వినియోగించుకోవడానికి వీలుగా డిజైన్‌ చేసిన ఈ మాడల్‌ రూ.5.29 లక్షల నుంచి రూ.6.29 లక్షల లోపు ధరను నిర్ణయించింది.

ఈ సందర్భంగా టాటా మోటర్స్‌ ప్యాసింజర్‌ వెహికల్‌ లిమిటెడ్‌ ఎండీ, సీఈవో శైలేష్‌ చంద్ర మాట్లాడుతూ..నూతన డ్రైవింగ్‌ అనుభవం కోరుకుంటున్న యువతను దృష్టిలో పెట్టుకొని ఈ మాడల్‌ను డిజైన్‌ చేసినట్టు, అలాగే పనితీరు, ైస్టెలిష్‌, టెక్నాలజీ, భద్రతా ప్రమాణాలకు పెద్దపీట వేసినట్టు చెప్పారు.

ధరలు పెంచే యోచనలో సంస్థ

గడిచిన రెండేండ్లుగా మూడు సార్లు ధరలు పెంచిన సంస్థ మరోసారి ధరలు పెంచడానికి సిద్ధమవుతున్నది. కమోడిటీ ఉత్పత్తుల ధరలు భారీగా పుంజుకుంటున్న నేపథ్యంలో సంస్థపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకోవడానికి మరోసారి ధరలు పెంచకతప్పదని శైలేష్‌ చంద్ర సూచనప్రాయంగా చెప్పారు. ఇటీవలికాలంలో కమోడిటీ ఉత్పత్తుల ధరలు రెండంకెల స్థాయిలో పెరిగాయని, దీంతో సంస్థ లాభాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తున్నదని, దీంతో ధరలను సవరించకతప్పదని చెప్పారు. అక్టోబర్‌ 1 నుంచి అమలులోకి వచ్చేలా ప్యాసింజర్‌, కమర్షియల్‌ వాహన ధరలను ఒక్క శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana