Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తమ సైనికులకు అమెరికా శిక్షణ ఇస్తోందన్న తైవాన్‌.. చైనా ఆగ్రహం

తమ సైనికులకు అమెరికా శిక్షణ ఇస్తోందన్న తైవాన్‌.. చైనా ఆగ్రహం

బీజింగ్‌: తమ సైనికులకు అమెరికా శిక్షణ ఇస్తున్నట్లు తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ తెలిపారు. తైవాన్‌లో అమెరికా దళాలు ఉన్న విషయాన్ని ఆమె ధ్రువీకరించారు.

అమెరికా దళాలు కొద్ది సంఖ్యలో తైవాన్‌కు వచ్చి తమ ఆర్మీకి ట్రైనింగ్‌ ఇస్తున్నారని సీఎన్‌న్ వార్తా చానల్‌తో అన్నారు. 'మా రక్షణ సామర్థ్యాన్ని పెంచుకునే లక్ష్యంలో భాగంగా యుఎస్‌తో మాకు విస్తృత సహకారం ఉంది' అని తెలిపారు.

కాగా, తైవాన్‌ అధ్యక్షురాలి ప్రకటనపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్‌ సైన్యానికి అమెరికా శిక్షణ ఇవ్వడాన్ని ఖండించింది. తైవాన్‌, అమెరికా మధ్య సైనిక సంబంధాలను చైనా వ్యతిరేకించింది. తైవాన్‌ తమ ప్రధాన భూభాగం నుంచి విడిపోయిన ఒక భాగమని పేర్కొంది.

తమ అంతర్గత అంశాల్లో అమెరికా జోక్యాన్ని చైనా మరోసారి వ్యతిరేకించింది. రెచ్చగొట్టే చర్యలు సమస్యను మరింతగా పెంచుతుందని హెచ్చరించింది. 'తైవాన్ స్వాతంత్ర్యం ముగిసిపోయింది. దానిని సమర్ధించే వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు' అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ గురువారం మీడియాతో అన్నారు.

ఒక-చైనా సూత్రం చైనా-యుఎస్ సంబంధాలకు రాజకీయ పునాది అని వాంగ్ తెలిపారు. 'జాతీయ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను రక్షించుకోవడంలో చైనా ప్రజల దృఢ సంకల్పాన్ని అమెరికా తక్కువగా అంచనా వేయకూడదు' అని వ్యాఖ్యానించారు. తైవాన్‌తో సైనిక సంబంధాలను “సాసేజ్ కటింగ్” పద్ధతిలో పెంచుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోందని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి టాన్ కెఫీ విమర్శించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana