Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tej Pratap | 'రబ్రీ దేవి పాదాలకు నమస్కరించిన సామ్రాట్ చౌదరి'.. ఏఐ ఫొటో షేర్‌   చేసిన తేజ్ ప్రతాప్

Tej Pratap | 'రబ్రీ దేవి పాదాలకు నమస్కరించిన సామ్రాట్ చౌదరి'.. ఏఐ ఫొటో షేర్‌ చేసిన తేజ్ ప్రతాప్

పాట్నా: బీహార్ మాజీ మంత్రి, జనశక్తి జనతా దళ్ నాయకుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap) సోషల్‌ మీడియాలో ఒక ఫొటో షేర్‌ చేశారు. తన తల్లి రబ్రీ దేవి పాదాలకు సీఎం సామ్రాట్ చౌదరి నమస్కరిస్తున్న ఏఐ చిత్రాన్ని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

బహిరంగ సమావేశాల్లో సంయమనం పాటించాలని, గౌరవపూర్వకమైన భాషను ఉపయోగించాలని సూచించారు. మాజీ సీఎం రబ్రీ దేవి తన అధికార నివాసాన్ని ఖాళీ చేయకపోవడాన్ని సీఎం సామ్రాట్‌ చౌదరి ఇటీవల బహిరంగంగా విమర్శించారు. 'నివాసాన్ని ఖాళీ చేయకుండా ఆపే అధికారం ఎవరికీ లేదు. ప్రభుత్వ ఆస్తి తమదే అన్నట్లుగా కొందరు ప్రవర్తిస్తున్నారు' అని ముజఫర్‌పూర్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన అన్నారు.

కాగా, రబ్రీ దేవి పెద్ద కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ దీనిపై స్పందించారు. రబ్రీ దేవి పాదాలకు సీఎం సామ్రాట్ చౌదరి నమస్కరిస్తున్న ఏఐ చిత్రాన్ని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ముఖ్యమంత్రికి దీనిని ట్యాగ్‌ చేశారు. రాజకీయ నాయకులు, ముఖ్యంగా రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, బహిరంగ ప్రకటనలు చేసేటప్పుడు హుందాగా, మర్యాదగా ప్రవర్తించాలని ఆయన సూచించారు.

'మా అమ్మ మా గౌరవానికి చిహ్నం. అందువల్ల ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్య అయినా సరైనదిగా భావించలేం. ప్రజాస్వామ్యంలో రాజకీయ విభేదాలు సహజమే. అయినప్పటికీ, సంభాషణ ఎల్లప్పుడూ మర్యాదపూర్వకంగా, గౌరవప్రదంగా ఉండాలి. పరస్పర గౌరవం, హుందాగా మాట్లాడే విధానమే రాజకీయాలకు నిజమైన గుర్తులు' అని తేజ్‌ ప్రతాప్‌ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana