హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను 70 శాతం సిలబస్‌తో నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంసెట్ సిలబస్‌ను కూడా తగ్గించే అవకాశం ఉంది. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో 70 శాతం సిలబస్‌తో ఫైనల్ పరీక్షలు నిర్వహించి, మిగతా 30 శాతం సిలబస్‌ను అసైన్‌మెంట్స్, ప్రాజెక్టుల రూపంలో బోధించారు. అయితే ఇంటర్ సిలబస్ ఆధారంగానే ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తారు. కాబట్టి ఇంటర్మీడియట్ పరీక్షలను 70 శాతం సిలబస్‌తో నిర్వహించాలని నిర్ణయించాలని నేపథ్యంలో.. విద్యార్థులపై భారం పడకుండా ఉండేందుకు ఎంసెట్‌ను కూడా అదే సిలబస్‌తో నిర్వహించేందుకు సన్నాహాకాలు చేస్తున్నట్లు రాష్ర్ట ఉన్నత విద్యామండలిలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

