Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ పాలిట శని బీజేపీ

తెలంగాణ పాలిట శని బీజేపీ

  • ఆ పార్టీ ఎంపీలు రాష్ర్టానికి ఏమీచేయని దద్దమ్మలు
  • బండి సంజయ్‌, అర్వింద్‌ది బజారు భాష
  • పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు
  • మీడియాతో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌

హైదరాబాద్‌, నవంబర్‌ 30 (నమస్తే తెలంగాణ): బీజేపీ రైతాంగం పట్ల కక్ష గట్టినట్టుగా వ్యవహరిస్తూ, తెలంగాణ పాలిట శనిగా మారిందని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ విమర్శించారు.

ఆ పార్టీ నేతలు పచ్చని రాష్ట్రంలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి ఆటలు ఇక్కడ సాగవని పేర్కొన్నారు. మంగళవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్‌, సైదిరెడ్డి, సురేందర్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతలు తమ భాష మార్చుకోకపోతే, తీవ్ర పరిణామాలు ఉంటాయని, రైతులే తరిమికొడతారని హెచ్చరించారు. ఈ ఇద్దరు సభ్యత, సం స్కారం మరచి బజారుభాష మాట్లాడుతున్నారని చెప్పారు. అసలు విషయాలకు సమాధానం చెప్పకుం డా సీఎం కేసీఆర్‌ గురించి ఏకవచనంలో మాట్లాడుతున్నారని అభ్యంతరం వ్యక్తంచేశారు.

సీఎం కేసీఆర్‌ చిత్తశుద్ధిని ప్రశ్నించే స్థాయి వీరికున్నదా? అని మండిపడ్డాడు. బీజేపీ ఎంపీలకు చేతనైతే వ్యవసాయ వార్షిక ప్రణాళిక కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని, ప్రధాని మోదీ కార్యాలయం ఎదుట ధర్నా చేయాలని హితవు చెప్పారు. విద్యాసాగర్‌రావు, దత్తాత్రేయలాంటి బీజేపీ నేతలంటే గౌరవం ఉండేదని, ఇప్పటి నేతలతో ఆ పార్టీ కంపుకొడుతున్నదని అన్నారు. బీజేపీ ఎంపీలు థర్డ్‌క్లాస్‌ నేతలుగా మారి, రాష్ర్టానికి ఏమీ చేయలేని దద్దమ్మలయ్యారని విమర్శించారు.

పసుపుబోర్డు తేలేనోడు ప్రపంచ విషయాలు మాట్లాడుతున్నాడని ఎంపీ అర్వింద్‌ను ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని లొట్టపీసు చట్టమన్న అర్వింద్‌ను దళిత, గిరిజన ఆదివాసీ లు తరిమికొట్టడం ఖాయమని హెచ్చరించారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ తరహాలనే బీజేపీ దేశాన్ని పీడిస్తున్నదని ఎమ్మెల్యే సైదిరెడ్డి విమర్శించారు. అదానీ, అంబానీలను బాగు చేయడం తప్ప బీజేపీకి మరో పనిలేదని విమర్శించారు. కేసీఆర్‌ను తిడితే బీజేపీ ఎంపీలు హీ రోలు కారని, జీరోలు అవుతారని చెప్పారు. ఢిల్లీ బీజే పీ నేతలు ఒకటి మాట్లాడితే రాష్ట్ర నేతలు మరోలా మా ట్లాడుతున్నారని ఎమ్మెల్యే సురేందర్‌ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana