Telangana : నిషేధిత జాబితాలో చేర్చిన 22A భూములపై తెలంగాణ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ప్రతిపక్షం బీఆర్‌ఎస్, బాధిత రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైనందున..
రిజిస్ట్రేషన్‌కు అనుమతిచ్చింది సర్కార్. జీహెచ్‌ఎంసీ( GHMC) డీటీసీపీ (DTCP), హెచ్‌ఎండీఏ (HMDA).. ఈ మూడింటి అప్రూవల్ ఉంటే ఎంచక్కా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది.
ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చిన 22Aలోని భూములపై కీలక ప్రకటన వెలువడింది. ఈ జాబితాలో ఉన్నా సరే రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని గురువారం సర్కార్ సర్క్యులర్ విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీ( GHMC) డీటీసీపీ (DTCP), హెచ్‌ఎండీఏ (HMDA).. ఈ మూడింటి అప్రూవల్ ఉంటే ఎంచక్కా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో లక్షలాది మందికి ఊరట దక్కనుంది. 22A భూముల వ్యవహారం ఇటీవల రాష్ట్రంలో తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

