Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Telangana | రాష్ట్రావతరణ వేళ కళ తప్పిన క్లాక్ టవర్.. అప్పటి వెలుగులేవీ..!

Telangana | రాష్ట్రావతరణ వేళ కళ తప్పిన క్లాక్ టవర్.. అప్పటి వెలుగులేవీ..!

Telangana : పరాయి పాలనపై జంగ్ సైరన్ మోగించి, నీళ్లు, నిధులు, నియమాలపై బరిగీసి కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమకాలపు ఆనవాళ్లు కళ తప్పాయి.

ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2) వేళ విద్యుత్ కాంతుల్లో దేదీప్యమానంగా వెలుగుతూ.. స్వరాష్ట్ర ఉద్యమ పోరాటాన్ని కళ్లముందుంచే నిర్మాణాలు బోసిపోయాయి. రాష్ట్రావతరణ వేడుక సందర్భంగా ధగధగ మెరవాల్సిన సికింద్రాబాద్ క్లాక్ టవర్, తెలంగాణ అమర వీరుల స్తూపం కాంగ్రెస్ నిర్లక్ష్యం కారణంగా మునపటి వెలుగులకు దూరమయ్యాయి.

తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో విద్యుత్ కాంతులతో జిగేల్‌మన్న క్లాక్ టవర్, అమర వీరుల స్తూపం ఇప్పుడు చీకట్లో దిగులుగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ చరిత్రాత్మక నిర్మాణాలకు విద్యుత్ కాంతులలతో అలంకరణ చేయకపోవడం స్థానికులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.

బీఆర్‌ఎస్ పాలనలో అలా.. రేవంత్ నిర్లక్ష్యంతో ఇలా..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana