Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Telangana Revenue | ఆదాయం 100.. అప్పు 108.. ఏప్రిల్‌ నెల నివేదికలో కాగ్‌ వెల్లడి

Telangana Revenue | ఆదాయం 100.. అప్పు 108.. ఏప్రిల్‌ నెల నివేదికలో కాగ్‌ వెల్లడి

Telangana Revenue | హైదరాబాద్‌, జూన్‌ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్థ, అనాలోచిత విధానాల వల్ల రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయి, అప్పుల ఊబిలో కూరుకుపోయినట్టు స్పష్టమవుతున్నది.

ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన సొంత ఆదాయం కంటే, మారెట్‌ నుంచి తెచ్చిన అప్పులే ఎకువగా ఉండటం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. పన్నులు, పన్నేతర ఆదాయం, కేంద్ర గ్రాంట్లు అన్నీ కలిపినా రాష్ట్రానికి వచ్చిన ఆదాయం రూ.10,974.73 కోట్లు మాత్రమే. కానీ ఏప్రిల్‌ నెలలో ప్రభుత్వం చేసిన అప్పులు ఏకంగా రూ.11,413.93 కోట్లు కావడం గమనార్హం. అంటే, రాష్ట్ర ప్రభుత్వం పన్నుల ద్వారా రూ.100 ఆదాయం సంపాదిస్తుంటే, దానికి ప్రతిగా 108 రూపాయల అప్పు చేస్తున్నది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇంతగా దిగజారడం బహుశా ఇదే మొదటిసారి. రాష్ట్ర ప్రభుత్వం కేవలం అప్పుల మీదే బతుకు బండిని లాగుతున్నదని తాజాగా విడుదలైన ఏప్రిల్‌ నెల కాగ్‌ నివేదిక స్పష్టం చేసింది. ఏప్రిల్‌ నెలలో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం 10,598.33 కోట్లు కాగా, ఇది ప్రభుత్వం చేసిన అప్పుల కంటే రూ.816 కోట్లు తకువగా ఉండటం గమనార్హం.

ఆదాయం పెరగాల్సింది పోయి తగ్గింది

గత ఏడాది ఏప్రిల్‌లో పన్నుల ద్వారా రెవెన్యూ బడ్జెట్‌ అంచనాల ప్రకారం.. రూ.10,916.68 కోట్లు (6.23శాతం) రాగా, ఈ సారి రూ.10,598.33 కోట్లు (5.84 శాతం) మాత్రమే వచ్చింది. గత ఏడాది ఏప్రిల్‌లో అప్పులు రూ.5,230.99 కోట్లు (9.69 శాతం) తీసుకోగా, ఈ సారి మాత్రం రూ.11,413.93 కోట్లు (19.52 శాతం) సమీకరించారు. ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పుడు రూ.6,857.76 కోట్ల రెవెన్యూ మిగులు (సర్‌ ప్లస్‌) ఉంటుందని అంచనావేసింది. కానీ, క్షేత్రస్థాయిలో కాగ్‌ ఇచ్చిన నివేదిక ఆ బండారాన్ని బద్దలు కొట్టింది. ఏప్రిల్‌ నెలలోనే తెలంగాణ ఏకంగా రూ.8,526.59 కోట్ల రెవెన్యూ లోటును నమోదు చేసింది. అంతేకాకుండా, ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే రూ.11,413.93 కోట్ల ద్రవ్య లోటు నమోదైంది.

జీతాలు, పెన్షన్లకే పరిమితం..
ఆదాయం రాకపోయినా విచ్చలవిడి ఖర్చులు మాత్రం తగ్గడం లేదు. ఏప్రిల్‌ నెలలో ప్రభుత్వం చేసిన మొత్తం వ్యయం రూ.21,472.31 కోట్లు. ఇందులో సింహభాగం కేవలం అనుత్పాదక రంగాలకే (రెవెన్యూ వ్యయాలకే) పోయింది. రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు, రోడ్లు, మౌలిక వసతుల కల్పన వంటి అభివృద్ధి పనులకు పెట్టే పెట్టుబడి పూర్తిగా అట్టడుగుకు పడిపోయింది. కేవలం అప్పులు తెచ్చి పప్పుకూడు వండుతున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వ తీరు చూస్తుంటే… తెలంగాణ భవిష్యత్తు అంధకారంగా మారడం ఖాయంగా కనిపిస్తున్నట్టు ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వివిధ వనరుల ద్వారా వచ్చిన పన్నులు ఇలా..

  • జీఎస్టీ 3,155 కోట్లు అమ్మకపు పన్ను: 2,923 కోట్లు
  • రాష్ట్ర ఎక్సైజ్‌ డ్యూటీలు: 1,445 కోట్లు
  • స్టాంపులు, రిజిస్ట్రేషన్లు: 1,413 కోట్లు
  • కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా: 1,260 కోట్లు
  • ఇతర పన్నులు, డ్యూటీలు: 400.01 కోట్లు
  • ఏప్రిల్‌ నెల అప్పులు: 11413.93 కోట్లు
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana