Sunday, 23 Dec, 1.21 am నమస్తే తెలంగాణ

తెలంగాణ
తెలుగు వర్సిటీ 2016 సాహితీ పురస్కారాలు

-పద్య కవితలో నటేశ్వరశర్మ, వచన కవితలో అన్నవరం దేవేందర్ ఎంపిక -త్వరలో సత్కరించనున్నట్టు తెలిపిన వర్సిటీ ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ హైదరాబాద్, నమస్తే తెలంగాణ : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2016 సాహితీ పురస్కారాలను ప్రకటించింది. తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు పురస్కారాలను ప్రకటించినట్టు శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. పద్యకవితా ప్రక్రియలో డాక్టర్ ఆయాచిత నటేశ్వరశర్మ (శకుంతుల), వచన కవిత ప్రక్రియలో అన్నవరం దేవేందర్ (పొక్కిలి వాకిళ్ల పులకరింత) ఎంపికయ్యారు. బాలసాహిత్యంలో చొక్కాపు వెంకటరమణ రచించిన (చెట్టు చెప్పిన కథలు), కథానికా ప్రక్రియలో డాక్టర్ యంయం వినోదిని (బ్లాక్ ఇంక్), నవలా ప్రక్రియలో అక్కినేని కుటుంబరావు రచించిన కొల్లేటి జాడలు, సాహిత్య విమర్శలో జీ లక్ష్మీనరసయ్య రచించిన కవిత్వ నిర్మాణ పద్ధతులు పురస్కారాలకు ఎంపికయ్యాయి. నాటకం/నాటికల్లో శంకరమంచి పార్థసారథి రచించిన హాస్యనాటికలు, అనువాదంలో ఐతా చంద్రయ్య రచించిన హిందీ కథా సంగ్రహం కు పురస్కారాలు దక్కాయి. వచన రచనల విభాగంలో డాక్టర్ ద్యావనవల్లి సత్యనారాయణ రచించిన తెలంగాణ కొత్త చారిత్రక స్థలాలు, రచయిత్రి ఉత్తమ గ్రంథం విభాగంలో డాక్టర్ రాని ప్రేమలత రచించిన ఆలోకనం గ్రంథాలు సాహితీ పురస్కారం పొందినట్టు ఉపకులపతి అచార్య ఎస్వీ సత్యనారాయణ తెలిపారు.

త్వరలో హైదరాబాద్‌లో జరిగే ప్రత్యేక ఉత్సవంలో ఈ పురస్కారాలు ప్రదానం చేయనున్నట్టు వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana
Top