Thief | దొంగలు పలు రకాలు.. అందులో తాజాగా సీసీ కెమెరాల్లో చిక్కిన దొంగ ఓ రకం. ఎక్కువగా డబ్బు, ఆభరణాలను ఎత్తుకెళ్లే దొంగలను చూస్తుంటాం. సాధారణంగా ప్రొఫెషనల్ దొంగలు కొన్ని సార్లు ఏది దొరికినా మహాప్రసాదం అని స్వీకరిస్తుంటారు.
ఈ దొంగ కూడా అర్థరాత్రి చోరీలకు పాల్పడ్డాడు. ఇంతకీ ఇతడు ఏం దొంగిలించుకెళ్తున్నాడో తెలుసా..? మెల్లగా ఓ ఇంటి గేటు తీసి వరండాలో ఆరేసిన చీరలను చోరీ చేస్తున్నాడు. ఈ ఘటన తూప్రాన్‌లో వెలుగుచూసింది.
సదరు దొంగ అర్థరాత్రి 3: గంటల సమయంలో ఓ ఇంటి బయట ఆరేసిన చీరలు తీసి మంచిగా మడతపెట్టి.. అటు నుంచి పక్కనే ఉన్న మరో ఇంటి గేటు తీసి ASI ఇంటి నుంచి స్కూటీని కూడా ఎత్తుకెళ్లాడు. మరో ఇంట్లో గిన్నెలు కూడా ఎత్తుకెళ్లాడు. ఆదివారం జరిగిన ఈ చోరీ దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

