తాజావార్తలు
టీఆర్‌ఎస్‌తోనే నగరాభివృద్ధి: మంత్రి ఈటల

జీడిమెట్ల : టీఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని రాష్ట్ర వైద్య ఆరో గ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. చింతల్ డివిజన్ పరిధిలోని టీఆర్‌ఎస్ అభ్యర్థి రషీదాబేగం గెలుపు కోరుతూ భగత్‌సింగ్‌నగర్, వివేకానందనగర్ కాలనీల్లో జరిగిన ధూంధాం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి కుటుంబాలకు అండగా నిలుస్తూ .. అనేక సంక్షే మ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రూ.600 కోట్లను వరద బాధితులకు అందించిందని, చింతల్ డివిజన్‌లో రూ. 67 వేల కోట్ల వ్యయం తో డ్రైనేజీ, సీసీరోడ్లతో పాటు ఇతర అభివృద్ధి పనులు చేపట్టిందని తెలిపారు. నగరంలో అన్ని రంగాల అభ్యున్నతికి ఎనలేని పథకాలను ప్రవేశపెడుతూ, వాటిని అమ లు చేస్తుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ ప్రాంతానికి ఒరగబెట్టిందేమి లేద న్నారు.
కేవలం ఎన్నికల కోసమే జనాల మధ్యకు వచ్చి లేనిపోని ఆరోపణలు చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాభివృద్ధే లక్ష్యంగా సాగుతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజ లు అండగా నిలిచినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమని, ఆ దిశగా గ్రేటర్‌లో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఎన్నికల ఇన్‌చార్జి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో ఎక్కడ చూసిన అభివృద్ధే కనిపిస్తుందన్నారు. ప్రజలంతా టీఆర్‌ఎస్ వైపుకే మొగ్గు చూపుతున్నారని, చింతల్ డివిజన్ అభ్యర్థి రషీదా బేగంను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, డివిజన్ అధ్యక్షుడు మహ్మద్ రఫీతో పాటు కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
related stories
-
తెలంగాణ తాజావార్తలు సీఎం కేసీఆర్ నేతృత్వంలో స్థానికసంస్ధలు బలోపేతం అయ్యాయి- ఎర్రబెల్లి
-
Posts తెలంగాణ మంత్రులపై సర్పంచ్ ల తిరుగుబాటు.
-
తాజావార్తలు మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం : మంత్రి ఈశ్వర్