Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Toxic | 'టాక్సిక్' అడ్వాన్స్ బుకింగ్స్‌లో సంచలనం.. 1.62 మిలియన్ టికెట్లతో రికార్డు స్థాయి క్రేజ్!

Toxic | 'టాక్సిక్' అడ్వాన్స్ బుకింగ్స్‌లో సంచలనం.. 1.62 మిలియన్ టికెట్లతో రికార్డు స్థాయి క్రేజ్!

Toxic | రాకింగ్ స్టార్ యష్ హీరోగా మలయాళ స్టార్ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టిస్తోంది.

ఈ సినిమాపై ఉన్న అంచనాలు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో టికెట్ల అమ్మకాలు జరగడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.తాజా సమాచారం ప్రకారం, 'టాక్సిక్' చిత్రానికి 1.62 మిలియన్లకు పైగా టికెట్లు అడ్వాన్స్‌గా అమ్ముడయ్యాయి. దీంతో అత్యధిక అడ్వాన్స్ టికెట్ సేల్స్ సాధించిన భారతీయ చిత్రాల్లో ఈ సినిమా అగ్రస్థానంలో నిలిచినట్లు ప్రచారం జరుగుతోంది.

భారీ స్టార్‌డమ్, ఆసక్తికరమైన కాన్సెప్ట్, యశ్ నాలుగేళ్ల తర్వాత సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడం వంటి అంశాలు ఈ రికార్డు స్థాయి బుకింగ్స్‌కు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. 'టాక్సిక్' అడ్వాన్స్ బుకింగ్స్ జోరు ఎంత భారీగా ఉందంటే, గతంలో భారీ హైప్‌తో వచ్చిన కొన్ని బిగ్ బడ్జెట్ చిత్రాల అడ్వాన్స్ సేల్స్ రికార్డులను కూడా అధిగమించినట్లు తెలుస్తోంది. 'కాంతార చాప్టర్ 1', 'ధురంధర్ 2' వంటి భారీ చిత్రాల రికార్డులను దాటిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యశ్ అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై చూపిస్తున్న ఆసక్తి బుకింగ్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం కన్నడ మార్కెట్‌లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా 'టాక్సిక్'కు భారీ స్పందన లభిస్తోంది.

తెలుగు ప్రేక్షకుల్లో యశ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'కేజీఎఫ్' సిరీస్‌తో ఆయన పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో, హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల్లో అంచనాలు వినిపిస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌లో కనిపిస్తున్న ఊపు విడుదల రోజు వరకు కొనసాగితే యశ్ కెరీర్‌లో మరో భారీ ఓపెనింగ్ నమోదు కావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఈ చిత్రంలో యశ్ డ్యుయల్ రోల్‌లో కనిపించడం మరో ప్రధాన ఆకర్షణగా మారింది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, పవర్‌ఫుల్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు డార్క్ అండ్ ఇంటెన్స్ కథాంశంతో గీతూ మోహన్‌దాస్ ఈ చిత్రాన్ని రూపొందించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana