Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Toxic | 'టాక్సిక్' కథను యశ్ కంటే ముందే ఆ స్టార్ హీరోకు వినిపించారా ..!

Toxic | 'టాక్సిక్' కథను యశ్ కంటే ముందే ఆ స్టార్ హీరోకు వినిపించారా ..!

Toxic | కేజీఎఫ్: చాప్టర్ 2 తర్వాత సుమారు నాలుగేళ్ల విరామం తీసుకున్న రాకింగ్ స్టార్ యశ్ ఎట్టకేలకు భారీ అంచనాల నడుమ 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ భారీ ప్రాజెక్ట్ బుధవారం, ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్‌లోనూ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయడంతో మొదటి నుంచే దీనిపై భారీ హైప్ నెలకొంది.అయితే విడుదలైన తర్వాత సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఒకవైపు యశ్ నటన, భారీ విజువల్స్‌ను ప్రశంసిస్తుంటే.. మరోవైపు కథనం, స్క్రీన్‌ప్లేపై కొందరు ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు 'టాక్సిక్' సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ సినిమా కథను యశ్ కంటే ముందుగా ఓ ప్రముఖ స్టార్ హీరోకు వినిపించారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం నెట్టింట జరుగుతున్న ప్రచారం ప్రకారం.. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన 'టాక్సిక్' కథను మొదట కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు వినిపించారట. అయితే సినిమాలోని కొన్ని బోల్డ్ సన్నివేశాలు, భారీ స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్ కారణంగా ఈ ప్రాజెక్ట్‌పై సూర్య ఆసక్తి చూపలేదని ప్రచారం జరుగుతోంది. దీంతో చివరకు ఈ కథ యశ్ వద్దకు వెళ్లిందని, ఆయనకు కథ నచ్చడంతో 'టాక్సిక్' ప్రాజెక్ట్ పట్టాలెక్కిందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం లేదా సూర్య నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ప్రచారాన్ని అధికారిక సమాచారం వచ్చే వరకు కేవలం రూమర్‌గానే చూడాల్సి ఉంటుంది.

2022లో వచ్చిన 'కేజీఎఫ్ 2'తో పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయం అందుకున్న యశ్.. ఆ తర్వాత వెంటనే మరో సినిమా చేయకుండా చాలా సమయం తీసుకున్నారు. సరైన కథ, తన ఇమేజ్‌కు తగ్గ ప్రాజెక్ట్ కోసం ఆయన ఎదురుచూశారని అభిమానులు భావించారు. అందుకే 'టాక్సిక్'పై మొదటి నుంచే అంచనాలు భారీగా పెరిగాయి.ట్రైలర్లు, ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. ముఖ్యంగా యశ్‌ను మరోసారి డిఫరెంట్, ఇంటెన్స్ పాత్రలో చూడబోతున్నామనే ఉత్సాహం అభిమానుల్లో కనిపించింది. విడుదల తర్వాత 'టాక్సిక్'కు అన్ని వర్గాల నుంచి ఒకే రకమైన స్పందన మాత్రం రాలేదు. కొందరు ప్రేక్షకులు సినిమా స్క్రీన్‌ప్లే గందరగోళంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. ఎక్కువ పాత్రలు ఉండటం వల్ల కథలోని ప్రధాన అంశం కొన్నిచోట్ల గజిబిజీగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కథనం మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉండి ఉంటే సినిమా ఇంకాస్త మెరుగైన అనుభూతిని ఇచ్చేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana