Friday, 23 Apr, 12.45 am నమస్తే తెలంగాణ

తాజావార్తలు
ఉద్యమ ట్యాగ్‌లైన్‌ సాకారం

సీఎం కేసీఆర్‌ చారిత్రక నిర్ణయంతోనిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు
ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగుల జీవితాల్లో శాశ్వత వెలుగులు నింపాలన్న సీఎం కేసీఆర్‌ స్వప్నం జోనల్‌ వ్యవస్థతో నెరవేరబోతున్నదని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ తీసుకున్న చారిత్రక నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయటం తెలంగాణ సాధించిన గొప్ప విజయంగా అభివర్ణించారు. నిరుద్యోగ, యువ త, విద్యార్థుల పక్షాన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమ గురువు ప్రొఫెసర్‌ జయశంకర్‌ ప్రవచించిన నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్‌లైన్‌ను సీఎం కేసీఆర్‌ కఠోరదీక్షతో సాధించారని చెప్పారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజుతో కలిసి బాల్క సుమన్‌ మాట్లాడుతూ.. ఉద్యోగ నియామకాలకు అడ్డంకి తొలగిపోవడంతో త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడతాయని పేర్కొన్నారు. నిరుద్యోగులను రాజకీయాల కోసం రెచ్చగొట్టే బీజేపీ నాయకులు దమ్ముంటే ఆ పార్టీ పాలిత రాష్ర్టాల్లో చేపట్టిన ఉద్యోగ నియామక భర్తీ వివరాలను వెల్లడించాలని సవాల్‌ విసిరారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానన్న షర్మిల మాటలను ఓ జోక్‌గా అభివర్ణించారు. తమతోనే బంగారు తెలంగాణ సాధ్యమని పేర్కొనటం ఆమె అవగాహన రాహిత్యమని బాల్క సుమన్‌ మండిపడ్డా రు. కొత్త జోన్లకు రాష్ట్రపతి ఆమోదం తెలుపడంతో టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఓయూ ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, నల్లగొండలోనూ సంబురాలు జరుపుకొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana
Top