Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉమెన్స్‌ హాస్టల్‌లో అండాలు సేకరించే దందా..!

ఉమెన్స్‌ హాస్టల్‌లో అండాలు సేకరించే దందా..!

  • డబ్బు ఆశచూపి యువతులు, మహిళలకు ఎర..
  • అండాలు సేకరించి ఫెర్టిలిటీ కేంద్రాలకు విక్రయం
  • సరూర్‌నగర్‌ వెంకటేశ్వర కాలనీలోని శెట్టి ఉమెన్స్‌ హాస్టల్‌ కేంద్రంగా వ్యాపా రం

ఎల్బీనగర్‌, అక్టోబర్‌ 31 : అది పేరుకే ఉమెన్స్‌ హాస్టల్‌.. అక్కడ జరుగుతోంది మహిళల నుంచి అండాలను సేకరించే పనులు.. డబ్బు ఆశ చూపి ఉత్తర రాష్ర్టాలకు చెందిన మహిళలను రప్పించి హాస్టల్స్‌లో ఉంచి వారి అండాలను సేకరించి ఫెర్టిలిటీ సెంటర్లకు విక్రయిస్తున్నారు. పోలీసులు ముఠా గుట్టును రట్టుచేసి.. నిందితులను అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం..

సరూర్‌నగర్‌ తహసీల్దార్‌ కార్యాలయం సమీపం, వెంకటేశ్వర కాలనీలోని శెట్టి ఉమెన్స్‌ హాస్టల్‌ను దుర్గా ప్రసాద్‌ అనే వ్యక్తి నడుపుతున్నాడు. ఉత్తర రాష్ర్టాలకు చెందిన యువతులు, మహిళలను తీసుకువచ్చి హాస్టల్‌లో ఉంచి.. వారి నుంచి అండాలను సేకరించి.. ఫెర్టిలిటీ కేంద్రాలకు విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఉమెన్స్‌ హాస్టల్‌పై దాడి.. అందులో ఉన్న 15 మంది యువతులను, నిర్వాహకుడు దుర్గాప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో యువతుల నుంచి అండాలను సేకరించి కార్పొరేట్‌ ఫర్టిలిటీ కేంద్రాలకు పంపిస్తున్నారన్నారని తేలినట్టు సమాచారం. ఇప్పటివరకు ఎంతమంది యువతులు, మహిళల నుంచి అండాలను సేకరించారు.. వాటిని ఎక్కడెక్కడికి తరలించారు.. అనే పూర్తి వివరాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana