Dailyhunt
ఉపాధి కల్పించేందుకే జాబ్‌మేళా

ఉపాధి కల్పించేందుకే జాబ్‌మేళా

  • సంగారెడ్డి జిల్లా క్రీడల అధికారి అఖిలేష్‌రెడ్డి

సంగారెడ్డి, మే 8: ఉమ్మడి మెదక్‌ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకే జాబ్‌మేళా నిర్వహించామని సంగారెడ్డి జిల్లా క్రీడల అధికారి అఖిలేష్‌రెడ్డి స్పష్టం చేశారు.

శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్‌మేళా నిర్వహించామన్నారు.

జిల్లాతో పాటు సిద్దిపేట, మెదక్‌ జిల్లాల నుంచి 1500 వందల మంది నిరుద్యోగులు జాబ్‌ మేళాకు హాజరయ్యారన్నారు. అభ్యర్థుల అర్హతను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఐటీ, తయారీ, సర్వీస్‌ సెక్టార్‌ తదితర రంగాలకు చెందిన పరిశ్రమల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు, స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారన్నారు. అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధిత పరిశ్రమల యువజన, క్రీడల వారోత్సవాల ముగింపులో నియామక ఉత్తర్వులు అందజేస్తామని ఆయన తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana