Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
US-Iran strikes: అమెరికా దాడితో వెడ్డింగ్ పార్టీలో నలుగురు మృతి..  ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్

US-Iran strikes: అమెరికా దాడితో వెడ్డింగ్ పార్టీలో నలుగురు మృతి.. ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్

టెహ్రాన్‌: ఇరాక్‌, జోర్డాన్‌లో ఉన్న అమెరికా మిలిటరీ కేంద్రాలపై ఇరాన్ దాడి చేసింది. మంగళవారం ఇరాన్‌పై అమెరికా సైనిక దళాలు దాడులు(US-Iran strike) ప్రారంభించాయి.

ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రతిదాడులకు దిగినట్లు తెలిసింది. అమెరికా జరిపిన ఓ మిస్సైల్ దాడిలో నలుగురు మృతిచెందినట్లు ఇరానియన్ రెడ్ క్రెసింట్ పేర్కొన్నది. దక్షిణ ఇరాన్‌లోని సిరిక్‌లో ఓ ఇంట్లో పెళ్లి సంబరాలు జరుగుతున్న సమయంలో మిస్సైల్ దాడి జరిగింది. అయితే షార్పనల్ దిగడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో సుమారు 50 మందికిపైగా గాయపడ్డారు. హోర్ముజ్ జలసంధిలో కమర్షియల్ షిప్పింగ్‌పై ఐఆర్జీసీ దాడులు చేసిందని, దానికి బదులుగా ఇరాన్‌పై దాడి చేసినట్లు అమెరికా చెప్పింది.

అయితే అమెరికా తన దాడుల పట్ల చింతించాల్సి ఉంటుందని ఐఆర్జీసీ పేర్కొన్నది. జోర్డాన్‌లోని అకాబాలో ఉన్న అమెరికా మెరైన్ బేస్‌పై బుధవారం ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. 13 బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకున్నట్లు జోర్డాన్ ఆర్మ్డ్ దళాలు పేర్కొన్నాయి. అయితే 10 క్షిపణులను ధ్వంసం చేయగా, మరో 3 రిమోట్ ప్రదేశాల్లో పడినట్లు చెప్పారు. ఇరాన్ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana