- 21 తర్వాతే రుతుపవనాలు పుంజుకునే అవకాశం
హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : నైరుతి రుతుపవనాల పురోగతి మందగించడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది.
భారత వాతావరణ శాఖ(ఐఎండీ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం వర్షపాతంలో ఏకంగా 40 శాతం లోటు నమోదైంది. జూన్ 4 నుంచి జూన్ 17 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సాధారణంగా 65.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 39.7 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. ఇది దేశీయ రైతాంగానికి, ఖరీఫ్ సాగు పనులకు పెద్ద సవాలుగా మారింది. సాధారణంగా ఈ సమయానికి దట్టంగా కమ్ముకోవాల్సిన మబ్బులు లేకపోవడంతో రుతుపవన శ్రేణి బలహీనపడినట్టు స్పష్టమవుతున్నదని పేర్కొన్నారు.
అధిక శాతం మేఘాలన్నీ కేవలం బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైనవని, ఈ వర్షపాత లోటు పలు వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని తెలిపారు. ఇప్పటివరకు గుజరాత్‌లో అత్యధికంగా 98 శాతం వర్షపాతలోటు నమోదు కాగా, మహారాష్ట్రలో 79 శాతం ప్రతికూలత నమోదైంది. జార్ఖండ్‌లో 66 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 65 శాతం, మేఘాలయలో 85 శాతం మేర వర్షాలు కురువలేదు. ఈ కేటగిరీలోనే తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, బీహార్, అస్సాం రాష్ట్రాల్లో వానల కొరత స్పష్టంగా కనిపిస్తున్నది. తెలంగాణలో జూన్‌లో 130.3 మి.మీ సాధారణ వర్షపాతం కురవాల్సి ఉండగా బుధవారం వరకు 67.3 మి.మీ

