Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

వారెంటీ పొడగించిన ద్విచక్ర వాహన కంపెనీలు

చెన్నై : లాక్‌డౌన్‌ నేపథ్యంలో కస్టమర్ల కోసం వారెంటీ గడువులను యమహా, టీవీఎస్‌ సంస్థలు పొడిగించాయి. లైఫ్‌ టైమ్‌ క్వాలిటీ కేర్‌ సౌకర్యాన్ని 60 రోజులు పొడిగిస్తున్నట్లు ఇండియా యమహా మోటార్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 15 వరకు ఉచిత సర్వీసు గడువును, జూన్‌ వరకు సాధారణ వారెంటీని పొడిగిస్తున్నట్లు తెలిపింది. అలాగే మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 15 మధ్య ముగిసే వార్షిక మెయింటేనెన్స్‌ కాంట్రాక్టులనూ జూన్‌దాకా పొడిగిస్తున్నామన్నది. ఇక టీవీఎస్‌ మోటార్‌ సైతం మార్చి, ఏప్రిల్‌ మధ్య ఉంటే ఫ్రీ సర్వీస్‌ సదుపాయాన్ని జూన్‌ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. కస్టమర్ల సహాయార్థం 18002587111 టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేసింది.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana